స్కూళ్ళలో సీట్ల కొరతకి రెండు షిఫ్టులే పరిష్కారం
- February 27, 2017
ఇండియన్ స్కూళ్ళలో సీట్ల కొరతతో విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే స్కూల్ యాజమాన్యాలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇరువురి ఆలోచనల మేరకు రెండు షిఫ్టుల విధానానికే మొగ్గు కనిపిస్తోంది. నానాటికీ పెరుగుతున్న భారతీయ వలసదారుల సంఖ్య కారణంగా ఇండియన్ స్కూళ్ళలో అడ్మిషన్లు కష్టంగా మారిపోయాయి. ఆన్లైన్ అడ్మిషన్ విధానం ద్వారా అడ్మిషన్లు పొందే వీలున్నప్పటికీ విపరీతమైన ఒత్తిడి నెలకొంటోంది. ఇక్కడా ఇతరత్రా మార్గాల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిమాండ్‌కి తగ్గట్టుగా స్కూళ్ళలో సీట్లు లేకపోవడంతో రెండు షిఫ్టుల విధానం అయితే బావుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్తున్నారు. అయితే రెండు షిఫ్టులకు వేర్వేరుగా స్టాఫ్‌ని తీసుకోవాల్సి ఉంటుందని స్కూలు యాజమాన్యాలు అంటున్నాయి. ఇదొక్కటి తప్ప పెరుగుతున్న డిమాండ్‌ని తట్టుకోవడానికి వేరే ఆప్షన్ కన్పించడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే స్కూలు యాజమాన్యాలు కూడా చెప్పడం జరుగుతోంది. బిర్లా పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎకె శ్రీవాత్సవ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న స్కూళ్ళు, పెరుగుతున్న విద్యార్థులకు తగ్గట్టుగా అకామడేషన్ చేయలేకపోతుండడంతో రెండు షిఫ్టుల ఆలోచన అమల్లోకి రావాల్సి ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







