కుప్పకూలిన విమానం..నలుగురి మృతి
- February 28, 2017
కాలి ఫోర్నియా: అమెరికాలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. సోమవారం కాలిఫోర్నియాలోని రివర్ సైడ్ లో సోమవారం ఒక నివాస ప్రాంతం లోకి కూలిపోవడంతో నలుగురు దుర్మరణం చెందారు. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా విమానం కూలిపోయిన విమానం మంటల్లో చిక్కుకోవడంతో , ఆప్రాంతమంతా దట్ట మైన పొగవ్యాపించిందనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈశాన్య రివర్సైడ్ మున్సిపల్ విమానాశ్రయంనుంచి బయలుదేరిన చిన్న విమానం సెస్నా 310 నివాసం ప్రాంతంపై కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి ఇయాన్ గ్రెగర్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో రెండు గృహాలు మంటల్లో చిక్కుకున్నాయని ఫైర్ చీఫ్ మైఖేల్ మూర్ తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురితో బయలుదేరిన విమానం సాన్‌జోస్ కు తిరిగి వస్తుండగా, అకస్మాత్తుగా నివాసప్రాంతాల్లోకి దూసుకొచ్చి కుప్పకూలడంతో మంటలు వ్యాపించాయి.
వీరిలో ఇద్దరు పెద్దవాళ్లు, ముగ్గురు టీనేజర్లు ఉన్నట్టు సమాచారం. ఓ యువతి సహా ఇద్దరిని రక్షించిన పోలీసులు చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చనిపోయినవారు, విమానంలోనివారా, లేక స్థానికులా అనేది ఇంకా గుర్తించలేదని చెప్పారు. దాదాపు 30 మంది స్తానికులను అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి కు తరలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!







