చిరు మోహన్ బాబుల గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టిన మనోజ్
- February 28, 2017
మనోజ్ గుంటూరోడు సినిమా కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి విధితమే.. కాగా చిరంజీవి మోహన్ బాబు ల రిలేషన్ టామ్ అండ్ జెర్రీ అని అందరూ వ్యాఖ్యానిస్తుంటారు. కానీ వీరిద్దరి రిలేషన్ ఎప్పుడు అందరికీ ప్రశ్నార్ధకమే.. బయట కనిపిస్తే ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకొంటూ ఉండే చిరంజీవి మోహన్ బాబుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మంచు మనోజ్ బయట పెట్టాడు.. వివరాల్లోకి వెళ్తే...
చిరంజీవి, మోహన్ బాబులు ప్రతి వీకెండ్ కు బ్రేక్ ఫాస్ట్ చెయ్యడానికి హైదరాబాద్ లో ఉంటే తప్పని సరిగా కలుస్తారట. అసలు ఇప్పటి వరకూ చిరు మోహన్ బాబులు కలిసి వీకెండ్ స్పెండ్ చేస్తారు అనేది ఎవరికీ తెలియని విషయం.. కాదు ఊహకు అందని విషయం.. ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందంటే.. మనోజ్ తన సినిమా గుంటూరోడు కి చరణ్ ని వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగాడట.. కానీ ఆ సమయంలో చరణ్ అందుబాటులో లేడు.. దీంతో ఓ ఆదివారం చిరంజీవి ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళిన మనోజ్ తన కోరికను తెలియజేయగా... వెంటనే చిరంజీవి ఒకే చెప్పారట... మనోజ్ కు కూడా తెలియకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి.. మనోజ్ కు ఫోన్ చేసి ఎలా వచ్చిందో చెప్పు.. బాగోలేక పోతే మళ్ళీ చేద్దాం అని చిరంజీవి అనేసరికి మనోజ్ షాక్ తిన్నాడట... కాగా చిరంజీవి మోహన్ బాబుల స్నేహం సింపుల్ అండ్ స్వీట్ గా ఉంది కదా.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







