రోజుకు 100 కోట్ల గంటలు
- February 28, 2017
యూట్యూబ్.. ఏదైనా ఒక వీడియో చూడటం మొదలు పెడితే చాలు నిమిషాలు.. గంటలు ఇట్టే గడిచిపోతాయి. సమయం అస్సలు తెలియదు. ఒకదాని తర్వాత ఒకటి.. మరొకటి.. ఇంకొకటి. ఇలా చాలా మందికి అనుభవమే. అసలు ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో యూట్యూబ్ చూసే వారి సమయం మొత్తం కలిపితే ఎన్ని గంటలు అవుతుందో తెలుసా? 100 కోట్ల గంటలు. అవును మీరు విన్నది నిజమే. యూట్యూబ్ మాతృసంస్థ అయిన గూగుల్ ఈ విషయాన్ని వెల్లడించింది.
‘యూట్యూబ్‌లో రోజుకు బిలియన్ గంటల పాటు వీడియోలు వీక్షిస్తున్నారు. ఇది మాకు ఒక మైలురాయి’ అని యూట్యూబ్ ఉపాధ్యక్షుడు క్రిస్టోస్ గుడ్రో తెలిపారు. ‘ఒక వ్యక్తి బిలియన్ గంటలు యూట్యూబ్‌లో వీడియోలు చూడాలంటే లక్ష సంవత్సరాలు పడుతుందని ఆయన పేర్కొన్నారు. మరోపక్క ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విటర్ల ద్వారా కూడా వీడియోలు వీక్షించే వారి సంఖ్య పెరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







