తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి: కవిత
- February 28, 2017
తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌యూకే కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌సెల్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేశారని గుర్తుచేశారు.
ప్రస్తుతం బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్ఆర్ఐలకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, ఉపాధ్యక్షుడు దూసరి అశోక్, నవీన్‌రెడ్డి, శ్రీకాంత్, రత్నాకర్, సత్యం రెడ్డి, ప్రవీణ్‌కుమార్, కిరణ్‌రెడ్డి, శ్రీధర్‌రావు, మీడియా ఇన్చార్జి శ్రీకాంత్, యూకే ఇన్చార్జి విక్రమ్‌రెడ్డి, ఐటీ సెక్రటరి వినయ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







