మలబార్ ఆర్థిక సాయం పేదలకు గృహ నిర్మాణం కోసం
- February 28, 2017
హైదరాబాద్: పేద, బలహీన వర్గాల వారందరికీ సొంతిళ్లను నిర్మించి ఇవ్వాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పానికి చేయూనివ్వడానికి ప్రముఖ రియల్టీ, ఆభరణాల వ్యాపార సంస్థ మలబార్ గ్రూప్ ఆర్థిక సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వపు 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన', కేరళ ముఖ్యమంత్రి ప్రకటించిన 'లైఫ్ మిషన్' వంటి కార్యక్రమాలకు మద్దతు ప్రకటిస్తున్నామని గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ తెలిపారు.
గృహ నిర్మాణ ప్రాజక్టులకు అవసరమైన పాక్షిక ఆర్థిక సాయం మలబార్ హౌసింగ్ చారిటబుల్ ట్రస్ట్, మలబార్ డెవలపర్స్ నుంచి అందుతుందని పేర్కొన్నారు. 4 సెంట్ల స్థలం కలిగి, 600 చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యంలో ఇల్లు నిర్మించుకోదలచిన వారు భూమి దస్తావేజుల నకలు, ఇంటి ప్లాన్ కాపీ, ఫోటో గుర్తింపు కార్డులను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తులను సమీపంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ లేదా మలబార్ డెవలపర్స్ కార్యాలయం లేదా మలబార్ హౌసింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్‌లలో ఈ మార్చి 10 లోగా అందజేయాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







