మార్చి 28నే ఉగాది: శ్రీనివాస గార్గేయ
- February 28, 2017
విజయవాడ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): తిరుమల, శ్రీశైలం దేవస్థానాల పంచాంగాలతో జనంలో గందరగోళం నెలకొందని, ఉగాది పండుగను మార్చి 28వ తేదీనే జరుపుకోవాలని పొన్నలూరు శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ''2016 ఆగస్టు 12వ తేదీన విజయవాడలో జయేంద్ర సరస్వతి సమక్షంలో జరిగిన ఒక సమావేశంలో హేవిళంబి నామ సంవత్సర ఉగాదిని 2017 మార్చి 28న నిర్వహించాలని నిర్ణయించారు. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధాంతి కూడా ఇందుకు అంగీకరించారు. కానీ, బయటికి వచ్చాక మార్చి 29వ తేదీన ఉగాది అని ప్రకటించి, పంచాంగాలలో ఆ మేరకే ముద్రించారు. పాడ్యమి తిథి సూర్యోదయం తరువాత కనీసం 144 నిముషాలు ఉండాలి.
కానీ, 29వ తేదీ కేవలం 58 నిముషాలే ఉంటుంది. అందుకే, 28వ తేదీనే ఉగాది జరుపుకోవాలి'' అని శ్రీనివాస గార్గేయ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







