చరణ్ సినిమాలో మరో యువ హీరో
- March 01, 2017
ధృవ సినిమాతో సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ చిత్రంలో చరణ్ న్యూ లుక్ లో దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడట. త్వరలోనే షూటింగ్ ప్రారంభ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
రామ్ చరణ్, సమంతలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మరో యువ హీరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో గొడవ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైభవ్ తరువాత కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.
సోలో హీరోగా సినిమాలు చేస్తూనే ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈ యంగ్ హీరో రామ్ చరణ్ సినిమాలోనూ కీ రోల్ లో నటించనున్నాడు. మెగా కుటుంబంతో సన్నిహిత సంబందాలున్న సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడే వైభవ్. అందుకే రామ్ చరణ్ సినిమాలో క్యారెక్టర్ అనగానే కథ కూడా అడగకుండానే ఓకే చేశాడట ఈ యంగ్ హీరో.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







