మరో వివాదంలో నటుడు ప్రకాష్‌రాజ్
- March 01, 2017
నిత్యం ఏదో ఒక వివాదంలో వుండే సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్.. తాజాగా మరో వివాదానికి కేంద్రబిందువయ్యారు. తనతో సెల్ఫీ తీసుకునేందుకు దగ్గరకు వచ్చిన అభిమాని సెల్‌ఫోన్ పగులగొట్టి విమర్శల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం వేకువజామున చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ప్రకాష్‌రాజ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. అందులో బెంగళూరుకు చెందిన ఓ అభిమాని కొంచెం దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకోబోయాడు. అంతే! ఒక్కసారిగా సహనం కోల్పోయిన ప్రకాష్‌రాజ్.. అతని మొబైల్‌ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టడంతో అది ముక్కలైంది. ప్రకాష్‌రాజ్ ప్రవర్తనకు అభిమానులంతా దిగ్ర్భాంతి చెందారు. ఆయనతో వాగ్వివాదానికి దిగేలోపే ప్రకాష్‌రాజ్ విసవిసా నడుస్తూ తన కారెక్కి వెళ్లిపోయారు. దీని గురించి సదరు అభిమాని విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
తాజా వార్తలు
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!







