తగ్గిన పసిడి ధర

- September 22, 2015 , by Maagulf
తగ్గిన పసిడి ధర

బంగారం ధర వరుసగా రెండోరోజూ తగ్గుముఖం పట్టింది. ఈ రోజు రూ.150 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.26,510కి చేరింది. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,133.40 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం వల్ల ఈ లోహం ధర దేశీయంగా తగ్గుతోందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.ఈ రోజు వెండి ధరలు తగ్గి రూ.36,000 మార్కు దిగువకు చేరుకున్నాయి. రూ.170 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.35,830కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయకపోవడంతో డిమాండు తగ్గిందని దీంతో ఈ లోహం ధర తగ్గుముఖం పట్టిందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com