అనుమానాస్పద స్థితిలో సౌదీలో తెలంగాణ యువకుడి మృతి
- March 01, 2017
మెరుగైన జీవనం కోసం విదేశాల బాటపట్టిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ తండాకు చెందిన శ్రీనివాస్(26) మూడున్నరేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. ఓ పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా చేరాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ వాహనాన్ని వారం రోజుల క్రితం మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాస్‌ను సౌదీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో ఉన్న శ్రీనివాస్ మూడు రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, గురువారం ఉదయం శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సౌదీ పోలీసులు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులే తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంతో పాటు నిజా నిజాలు తెలుసుకోవడానికి యత్నించాలని మృతుని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







