భట్‌కి చంపేస్తామంటూ బెదిరింపులు
- March 02, 2017
ముంబయి: బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియాభట్ కుటుంబాన్ని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి బెదిరిస్తున్నాడు. ఆలియాభట్ తండ్రి, నిర్మాత మహేశ్ భట్‌కు ఫోన్ చేసి రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో ఆయనను, కుమార్తె ఆలియాభట్‌ను, భార్య సోని రజ్దాన్‌ను చంపేస్తామని బెదిరించాడు. మహేశ్ భట్ కుటుంబం ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును తర్వాత ముంబయి పోలీస్ యాంటీ ఎక్స్టోర్షన్ సెల్(ఏఎన్సీ)కు అప్పగించారు. వీరు పోలీసు శాఖతో కలిసి కేసు విచారణ జరపనున్నారు.
ఈ సంఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తి మహేశ్‌భట్‌కు ఫోన్ చేసి రూ.
50 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు. తొలుత ఈ బెదిరింపులను ఆయన సీరియస్‌గా తీసుకోలేదని, ఎవరో ఆకతాయిలు చేస్తున్న పనిగా భావించారన్నారు. కానీ మళ్లీ అటువైపునుంచి వాట్సాప్ సందేశాల ద్వారా హెచ్చరికలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. తాము కోరిన మొత్తం నగదును లఖ్నవూకి చెందిన బ్యాంకులో డిపాజిట్ చేయమని మహేశ్ భట్‌కు చెప్పారన్నారు.
లేనిఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారన్నారు. ఫిబ్రవరి 26న రాత్రి ఈ ఘటన జరిగిందని, కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకున్న ఆయన జుహు ప్రాంత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 387 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని, మహేష్ కుటుంబానికి భద్రత పెంచినట్లు తెలిపారు. భట్ కుటుంబానికి ఇలా బెదిరింపులు రావడం ఇది రెండోసారి.
వీరి కుటుంబాన్ని బెదిరించిన 13 మందితో కూడిన ఒక గ్యాంగ్‌ను 2014 నవంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







