ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడింది
- September 22, 2015
ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడింది. సిరియాలో గేలు అనే అనుమానంతో 10 మందిని అతి దారుణంగా కాల్చి చంపేశారు. అందరూ చూస్తున్న సమయంలో 10 మంది హత్యకు గురైనారు. తొమ్మిది మంది పురుషులు, ఒక బాలుడిని చంపేశారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. హోమ్స్ రాష్ట్రంలోని రస్తాన్ అనే పట్టణంలో ఈ 10 మందిని తీసుకు వచ్చి హోమోసెక్యువల్స్ అంటు నినాదాలు చేసి చంపేశారు. వీరిని చంపే సమయంలో ఎవ్వరూ వీడియోలు, ఫోటోలు తియ్యకుండా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తగిన జాగ్రతలు తీసుకున్నారని, ముందుగానే అక్కడ ఉన్న వీడియో కెమెరాలు, మొబైల్స్ ధ్వంసం చేశారని ఆ సంస్థ వెల్లడించింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు విశ్వాసులుగా ఉండటం, స్వలింగ సంపర్కం, చేతబడి చెయ్యడం ఇస్లామిక్ స్టేట్ అధిపత్యం ఉన్న ప్రాంతాలలో నేరం. అలా చేసిన వారికి బహిరంగంగా మరణ శిక్ష విధిస్తారు. గతంలో స్వలింగ సంపర్కులను పెద్ద పెద్ద భవనాల మీద నుంచి కిందకు పడేసి తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







