రజనీకాంత్ భాషా చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేస్తూoది
- March 03, 2017
''ఈ భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు'' ఈ డైలాగ్ ఏ సినిమాలోనిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. రజనీకాంత్ హీరోగా నటించి, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన భాషా సినిమా 22 సంవత్సరాల తర్వాత మళ్లీ విడుదలవుతోంది. 1995లో విడుదలైన ఈ సినిమాను మళ్లీ విడుదల చేయడమేంటని ఆశ్చర్యపోకండి. డిజిటల్ ఫార్మాట్లో ఈ సినిమాను ఇవాళ రీ రిలీజ్ చేశారు. సినిమా మళ్లీ ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. రజనీకాంత్ సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా భాషా నిలిచింది. నగ్మా అందచందాలు, రఘువరన్ విలనిజం ఈ సినిమా స్థాయిని మరింత పెంచాయి. ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా తమిళ ప్రజలు ఎగబడి చూస్తారనడంలో అతిశయోక్తి లేదు.
తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆశ్చర్యకర విషయమేంటంటే ఇటీవల ఆస్పత్రిలో చేరిన డీఎంకే ప్రెసిడెంట్ ఎమ్ కరుణానిధి అడిగి మరీ భాషా సినిమాను చూశారట. కోలీవుడ్లో ఈ రీ రిలీజ్ వ్యవహారం కొత్తేమీ కాదు. గతంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్ సినిమాల్లో కొన్ని సినిమాలకు ఆధునిక హంగులు అద్ది మళ్లీ విడుదల చేసిన సందర్భాలున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







