బ్రిటన్‌లో ఓ భారీ బాంబు బయటపడింది
- March 03, 2017
లండన్: బ్రిటన్‌లో ఓ భారీ బాంబు బయటపడింది. ఓ ఇంటి నిర్మాణంకోసం తవ్వకాలు జరుపుతుండగా పునాదులు అడుగున రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఫిరంగిగుండులాంటి 500 పౌండ్ల బరువున్న బాంబు కనిపించింది. సరిగ్గా వాయవ్య లండన్‌లోని బ్రెంట్ ప్రాంతంలో బ్రాండెస్బరి పార్క్ ప్రాంతంలోని ఈ బాంబు బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారందరికి ఒక్కసారిగా గుండెలు ఆగిపోయినంత పనైంది. ఈ విషయం తెలిసి వెంటనే అక్కడికి పోలీసులు, బాంబు నిర్వీర్య దళం, సైనికులు వచ్చారు. ఆ ప్రాంతలో రెండు పాఠశాలలు ఖాళీ చేయించారు. పలువురు స్వచ్ఛందంగా తమ నివాసాలను వదిలి దూరంగా వెళ్లిపోయారు.
దాదాపు 200 మీటర్ల దూరం ప్రత్యేక భద్రతను ఏర్పాటుచేసి ఎవరిని ఆ చుట్టుపక్కలకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారి మాట్లాడుతూ ముందుగా ఆ ప్రాంత వాసులకు ధన్యవాదాలు తెలిపారు. బాంబును గుర్తించి వెంటనే తమకు సమాచారం ఇచ్చారని, స్వచ్ఛందంగా తమ ఇళ్లను వదిలివెళ్లి బాంబు నిర్వీర్య దళానికి సహాయం చేస్తున్నారని చెప్పారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండా తీవ్రంగా శ్రమిస్తున్నామని తెలిపారు. అది కచ్చితంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబే నని దానిని చూస్తేనే సామాన్యులకు గుండెల్లో భయం పుడుతోందని, ఎలాంటి విస్ఫోటనం జరగకుండా తగిన విధంగా నిర్వీర్యానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







