అమెరికాలో నకిలీ పాస్ పోర్ట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన భారతీయుడు
- March 03, 2017
ఒక టీవీ స్టార్ ఫొటోతో తయారైన నకిలీ పాస్ పోర్ట్ అమెరికాలో పెద్ద కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. నకిలీ పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు, నగదు అక్రమ బదిలీ కుంభకోణం వెలుగులోనికి వచ్చింది. ఈ తప్పుడు పనుల ద్వారా లక్షల డాలర్లు సంపాదించిన ఓ భారతీయ అమెరికన్ కు అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. 1992లో అమెరికాకు వెళ్లిన అమిత్ చౌదరి అనే వ్యక్తికి అలెగ్జాండ్రియా ఫెడరల్ కోర్టు 9 ఏళ్ల జైలుశిక్ష విధించింది. తానెప్పుడూ జైలుకు వెళతానని అనుకోలేదని, కుటుంబం కోసంమే ఈ నేరాలకు పాల్పడ్డానని అమిత్ పేర్కొన్నాడు. ఎఫ్ బిఐ ఏజెంట్ ఒకరు అమెరికాలోని టీవీ స్టార్ లారా వండెర్ వూట్ చిత్రాన్ని నకిలీ పాస్ పోర్ట్ పై చూడడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఇతరుల క్రెడిట్ కార్డులను అమిత్ చౌదరి చోరీ చేసి ఆ డబ్బును షెల్ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా బదిలీ చేసేవాడు. తక్కువ ధరలకు ప్రయాణ ప్యాకేజీలు అందిస్తామంటూ ప్రకటనలు కూడా ఇచ్చేవాడు. ఆ తరువాత వినియోగదారుల డబ్బులు తస్కరించే వాడు. చోరీ చేసిన క్రెడిట్ కార్డులతో వారి హోటల్, ప్రయాణ, భోజన బిల్లులు చెల్లించేవాడు. భారత్ లోని అమెరికన్ ఎక్స్ ప్రెస్ లో పని చేసే ఓ వ్యక్తి సాయంతో నకిలీ క్రెడిట్ కార్డులు సృష్టించి 25 మిలియన్ డాలర్లు ఇతడు కొల్లగొట్టాడు. చివరికి టీవీ స్టార్ లారా చిత్రంతో కూడిన నకిలీ పాస్ పోర్ట్ ఆధారంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అమిత్ చౌదరి బృదంపై కన్నేసి వారిని పట్టుకుంది. ఈ కుంభకోణంలో తనతోపాటు మరికొందరికి సంబంధం ఉన్నట్లు అమిత్ ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







