ఏ.పి సి.ఎం గల్ఫ్ పర్యటనపై APNRT అధికారులు మరియు కువైట్ కో-ఆర్డినేటర్స్ వీడియో కాన్ఫరెన్స్
- March 04, 2017
సి.ఎం చంద్రబాబు నాయుడు గారి కువైట్ పర్యటనపై APNRT అధికారులు మరియు కువైట్ APNRT కో ఆర్డినేటర్స్ విడియో కాన్ఫరెన్స్
హాజరయిన కువైట్ APNRT కో ఆర్డినేటర్స్పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు మరియు ఇతర బృందంతో కలిసి ప్రపంచ దేశాలలో పర్యటించి, సమావేశాలు నిర్వహించరు. అందులో భాగంగాఅదే టైం లో గల్ఫ్ లో కూడా పర్యటించవలసి ఉంది కానీ అది అనివార్య కారణాల వలన పోస్ట్ పోన్ చేయడం అందరికి తెలిసిన విషయమే ఈ పర్యటనకు కొనసాగింపుగా వచ్చే నెల అనగా ఏప్రిల్ 2,3,4 తేదీలలో గల్ఫ్ లో పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అనధికారికంగా సమాచారం.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారికి ఘన స్వాగతం పలకడానికి కువైట్ మరియు యు ఏ ఈ లోని ఎపి ఎన్నార్టి కో ఆర్దినేటర్స్ భారీ సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా సౌదీ లో కూడా పర్యటించే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో ఎపి ఎన్నార్టి అధికారులు కువైట్ లోని ఎపి కో ఆర్డినేటర్ తో మిడిల్ ఈస్ట్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీ చప్పిడి రాజశేఖర్ సమన్వయకర్తగా ఒక వీడియో కాన్ఫరెన్సు ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో ఎపి ఎన్నార్టి సి ఈ ఓ శ్రీ వేమూరి రవి, శ్రీ మురళి, శ్రీ శేషు, osd శ్రీ డి వి రావు మరియు కువైట్ కో ఆర్డినేటర్ సమన్వయకర్త ఎపి ఎన్నార్టి కో అర్దినేటర్స్, సుబ్బారాయుడు ములకల, వెంకట్ కోడూరి, సుధాకర్ రావు కుదరవల్లి, అక్కిలి నాగేంద్ర, రమణ పేరం, ఉదయ్ ప్రకాష్ అడుసుమల్లి, బలరాం నాయుడు, రహమతుల్ల, ఈశ్వర్ నాయుడు, సురేష్ బాబు నాయుడు మలేపటి తో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకి సంబంధించి సలహాలను, సూచనలు ఇచ్చారు. ౩ గంటలకి పైగా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పలు అంశాల గురించి చర్చించారు. ముఖ్యంగా ఎపి ఎన్నార్టి చొరవ తీసుకుని చేసిన పలు కార్యక్రమాల గురించి కూడా ఒకసారి స్పురణకి తెచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రవాసాంధ్రుల కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో APNRT పేరిట ఒక డివిజన్ ను ప్రారంభించి, తెలుగు ప్రవాసులకు ఆవశ్యకమైన అన్నీ సేవలను అందిస్తూ, ఎన్నార్టీల మన్ననలను అందుకోవడం చాలా సంతోషం .
అంతేగాక, విదేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులందరినీ నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించుటలో, ఆంధ్రప్రదేశ్ పురోగతిని సాధించుటలో భాగస్వాములుగా చేయాలనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు ప్రవాసాంధ్రులమయిన మనం ఎప్పటికి సానుకూలంగా స్పందించి మన వంతు కృషి చేయాలి అని సీఈఓ రవి వేమూరి తెలిపారు .
నవ్యాంధ్రప్రదేశ్…ఆ పదం చాలు మాలో మాతృభూమి మధురానుభూతులను నెమరువేసుకునేందుకు. పుట్టిన గడ్డపై మమకారం చాటుకునేందుకు అందివచ్చే ఏ అవకాశాన్నయినా మేము వదులుకోము. మా వారితో కలిసిపోయేందుకు, మా సొంత గడ్డకు చేయూతనిచ్చేందుకు, అందుకని మేము పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపుతున్నప్పుడు మా దగ్గరికి సాక్ష్యాత్తు ఇలా ముఖ్యమంత్రి గారే రావడం నిజంగా మా అదృష్టం అని ఎపి కో ఆర్డినేటర్స్ అందరు తెలిపారు అలాగే మేమూ ఎపి ఎన్నార్టి ద్వారా ఇక్కడి తెలుగు వారికి చేయూతగా అవసరమైన సూచనలు, సలహాలను సత్వరం అందించడానికి తగిన ఏర్పాట్లని చేస్తున్నాము. ఆంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను వారికి తెలియజేయడంతోపాటు ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభమో కూడా APNRT కో ఆర్డినేటర్స్ సూచిస్తుంది. ఎన్నారైల పెట్టుబడులకి అండగా అన్నీ విషయాల్లోను పారదర్శకతను పాటించి వారికి ఇది నమ్మకమైన వేదికగా నిలపాలన్నది APNRT ఆకాంక్ష. అని రవి గారు తెలిపారు.
ఈ సమావేశంలో ఎపి ఎన్నార్టి సి ఈ ఓ శ్రీ వేమూరి రవి గారు, శ్రీ మురళి గారు, శ్రీ శేషుగారు, osd శ్రీ డి వి రావు గారు మరియు కువైట్ కో ఆర్డినేటర్ సమన్వయకర్త ఎపి ఎన్నార్టి కో అర్దినేటర్స్, సుబ్బారాయుడు ములకల, వెంకట్ కోడూరి, సుధాకర్ రావు కుదరవల్లి, అక్కిలి నాగేంద్ర, రమణ పేరం, ఉదయ్ ప్రకాష్ అడుసుమల్లి, బలరాం నాయుడు, రహమతుల్ల, ఈశ్వర్ నాయుడు, సురేష్ బాబు నాయుడు మలేపటి పాల్గొన్నారు.
చివర్లో మిడిల్ ఈస్ట్ కో ఆర్డినేటర్ తన ఆహ్వానాన్ని మన్నించి ౩ గంటల పైగా ఈ విడియో కన్ఫరెన్స్లో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎపి ఎన్నార్టి సి ఈ ఓ శ్రీ వేమూరి రవి, శ్రీ మురళి, శ్రీ శేషు, శ్రీ డి వి రావు లకి సమావేశం ఆహ్లాదకరంగా జరిగినందుకు, విలువయిన సూచనలు, సలహాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.


తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







