కాశీ విశ్వనాథునికి మోదీ పూజలు
- March 04, 2017
వారణాసి: తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన భారీ రోడ్‌షోలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. రోడ్‌షో చివరల్లో ఆయన ప్రఖ్యాత కాల భైరవ ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించారు. తొలుత శనివారం ఉదయం బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి ఆయన రోడ్‌షో ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి మోదీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఎంతో ఉత్సాహంగా రోడ్‌షోలో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తల హంగామా, పార్టీ జెండాలతో రోడ్‌షో అంతా కాషాయమయమైంది. మార్గమధ్యంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశ్వనాథునికి హారతి పట్టారు. ఏడో దశ పోలింగ్‌లో భాగంగా వారణాసి, జన్‌పూర్‌లలో ప్రధాని ప్రసంగించనున్నారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఇవాళ వారణాసిలో సంయుక్తంగా రోడ్‌షోలో పాల్గొంటున్నారు. ఈనెల 8న యూపీ ఎన్నికల తుది విడత పోలింగ్ 46 నియోజకవర్గాల్లో జరుగనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







