ప్రశాంతంగా ఎన్నికలు - యూపీ, మణిపూర్ లో
- March 04, 2017
ఉత్తర్ ప్రదేశ్ లో ఆరోవిడత, మణిపూర్ లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. యూపీలోని 49 నియోజకవర్గాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని 38 నియోజకవర్గాలకు మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజంగఢ్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఇవాళే పోలింగ్ జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికలు ములాయంకు ప్రతిష్టాత్మకంగా మారాయి. యూపీలో ఈసారి ఓటింగ్ శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. అటు మణిపూర్ లో ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







