క్రెడిట్ కార్డ్ ఫోర్జరీ: వ్యక్తికి జైలు శిక్ష
- March 04, 2017
పాకిస్తానీ బిజినెస్ మేన్ 16,737 దిర్హామ్ల విలువైన వస్తువుల్ని అక్రమంగా పొందిన క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన నేరంలో అరెస్టయ్యాడు. అతనికి ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. క్రెడిట్ కార్డ్ పొందేందుకోసం ఫోర్జరీ డాక్యుమెంట్లను నిందితుడు వినియోగించాడు. మరో వ్యక్తికి చెందిన రెసిడెన్స్ వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుని ఉపయోగించి క్రెడిట్ కార్డుని పొందాడు నిందితుడు. క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు సంబంధించి ఆ వ్యక్తికి సమాచారం పంపగా, ప్రతిసారీ అది రిటర్న్ రావడంతో నేరం వెలుగు చూసింది. విచారణ సందర్భంగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అయితే తనకు విధించిన శిక్షపై పదిహేను రోజుల్లోగా అపీల్ చేసుకునే అవకాశం ఉంది నిందితుడికి.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







