వలసదారులకు డ్రైవింగ్ ఫీజ్?
- March 04, 2017
మనామా: ట్రాఫిక్ సమస్యల్ని కొంతవరకు తగ్గించడానికి వలసదారులైన డ్రైవర్లకు 100 బహ్రెయినీ దినార్ల రుసుము విధించాల్సిందిగా ఎంపీ ఒకరు ప్రతిపాదించారు. పార్లమెంటు సభ్యుడు జలాల్ కాదిమ్ దీనికి సంబంధించి పార్లమెంటరీ ప్రపోజల్ని సమర్పించడం జరిగింది. డ్రైవర్లకు, అలాగే వాహనాలకు ఫీజులు విధించడం ద్వారా ట్రాఫిక్ పరిస్థితులు మెరుగవుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. అలాగే వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సుల ఫీజుల్ని డబుల్ చేయాల్సి ఉందని చెప్పారాయన. ఈ ఫీజుల ద్వారా సమకూరే ఆదాయాన్ని దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం వినియోగించవచ్చునని అభిప్రాయపడ్డారు ఎంపీ. జోర్డాన్, మలేసియాల్లో ఇలాంటి చట్టం ఒకటి ఉందని కూడా ఆయన గుర్తుచేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







