కైమా బీరకాయ
- March 04, 2017
కావలసిన పదార్థాలు: బీరకాయలు - అరకేజి, కైమా మటన్ - అరకేజి, పెద్ద ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 3, కారం - 2 టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర టీ స్పూను, నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూను, కొత్తిమీర - 1 కట్ట, మసాలపొడి - 1 టీ స్పూను, అల్లంవెల్లుల్లిపేస్టు - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: కైమాని శుభ్రంగా కడిగి నీరంతా వడకట్టి కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు పట్టించి గంటపాటు పక్కనుంచుకోవాలి. పాన్లో నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని దోరగా వేగించుకుని కైమా మిశ్రమాన్ని వేసి సన్నని మంటపై మగ్గనివ్వాలి. కైమా సగం ఉడికిన తర్వాత బీరకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి రెండు విజిల్స్ రాగానే మంట తీసేయాలి. కుక్కర్ మూత తీసేక మసాల పొడి, కొత్తిమీర చల్లుకోవాలి. ఇది అన్నంతో పాటు పరాటాల్లోకి కూడా ఎంతో బాగుంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







