మరగదనాణయంకు యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్‌బోర్డు
- March 12, 2017మరగదనాణయం చిత్రానికి సెన్సార్‌బోర్డు యూ సర్టిఫికెట్ అందించింది.ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన చిత్రం మరగదనాణయం.ఆనందరాజ్, మునీష్కాంత్, కాళీవెంకట్, అరుణ్ రాజ కామరాజ్, డేనీ, కోటాశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎంఎస్.భాస్కర్, మైమ్‌గోపి ము ఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నవదర్శకుడు ఏఆర్కే.శరవణ్ దర్శకత్వంలో యాక్సెస్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై డిల్లీబాబు నిర్మిస్తున్నారు.యాక్షన్, ఎండ్వెచర్, వినోదం కలగలిపిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని చిత్ర వర్గాలు వెల్లడించారు.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మరగదనాణయం చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిపారు.
చిత్రాలకు యూ సర్టిఫికెట్ రావడమే గగనంగా మారిన తరుణంలో తమ చిత్రానికి యూ సర్టిఫికెట్ రావడం సంతోషంగా ఉందని చిత్ర నిర్మాత ఢిల్లీబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.మంచి కథా చిత్రాలను నిర్మాంచాలన్న ఒక ఆశయంతో ఈ రంగంలోకి వచ్చామని, మరగద నాణయం ఆ స్థాయిలో ఉంటుందని చెప్పారు. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను పొందుతోంది.చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుందన్నది గమనార్హం.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్