దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పనిచేసే ఉచిత వై-ఫై
- March 15, 2017
డ్ ఎక్స్ బి దుబాయ్ విమానాశ్రయం నుంచి ప్రతి నెల లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ప్రయాణించే సమయంలో ఉచితంగా లభ్యమయ్యే వి -ఫై ఇంటర్నెట్ కనెక్షన్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పనిచేస్తుంది.వావ్ - ఫై అని వినియోగదారులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇతర విమానాశ్రయాల కన్నా100 ఎం బి పి ఎస్ వేగంతో ఇంటర్నెట్ కనెక్షన్ ఇక్కడ దొరుకుతుంది. గత సంవత్సరం డిసెంబర్ దుబాయ్ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా ఈ సేవలను ఏర్పాటు చేశారు. ఉచిత నవీనకరించిన అపరిమితమైన అధిక వేగంతో కూడిన వి -ఫై ఇంటర్నెట్ సేవలు దుబాయ్ ఇంటర్నేషనల్ డ్ ఎక్స్ బి మరియు దుబాయ్ వరల్డ్ సెంట్రల్ అంతటా ఉన్న దుబాయ్ విమానాశ్రయాల్లో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైఖేల్ ఇబిట్సన్ వ్యాఖ్యానిస్తూ డ్ ఎక్స్ బి యొక్క తాజా సమర్పణలో ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం గా పేరొందిన దుబాయ్ ఎయిర్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రయాణిస్తుంటారని తమ ఇంటర్నెట్ సేవలు పలువురి ఆదరాభిమానాలు చూరగొన్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం మేము మా విమానాశ్రయాలు అంతటా అపరిమిత ఉచిత అధిక వేగంతో వి -ఫై సేవలను ప్రారంభించినాట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఈ ఇంటర్నెట్ కేంద్రాల నుంచి త్వరగా డౌన్లోడ్ చేసే సామర్ధ్యంతో పాటు100 ఎం బి పి ఎస్ వేగంతో ఇమెయిల్స్, చిత్రాలు,వీడియోలు మరియు సామాజిక మీడియా ను తక్షణమే పొందగలుగుతారు.నవీకరణలతో కూడిన అప్లోడ్ చేయవచ్చు.దుబాయ్ విమానాశ్రయం వద్ద కూర్చొని ప్రపంచమంతటా ఉన్న వారి స్నేహితులు మరియు కుటుంబంతో సంబంధాన్ని కొనసాగించండని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







