బాంబు కలకలం అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో
- March 15, 2017
విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టు కలకలం రేగడంతో అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు నిలిపివేశారు. పార్కింగ్ ప్రాంతంలో ఓ సూట్ కేసు అనుమానాస్పదంగా పడి ఉండడంతో అందులో ఏముందోనని భయాందోళనలు చెలరేగాయి. అది ప్రమాదకరమైందో కాదో పరీక్షించేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. ఆ ప్రాంతం మొత్తం తనిఖీలు చేసిన అధికారులు ఎవరికీ గాయాలు కాలేదని నిర్ధారించారు. దేశవ్యతిరేక శక్తులు సంచరిస్తున్నాయంటూ ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతో పఠాన్ కోట్ వైమానిక స్థావరంతో పాటు, మమన్ కంటోన్మెంట్‌లో రెండురోజులుగా భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమృత్‌సర్‌లోని శ్రీ గురురామ్ దాస్‌జీ అంతర్జాతీయ విమాశ్రయంలో అనుమానాస్పద సూట్‌కేజు దర్శనమివ్వడం గమనార్హం.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







