విమానంలో పేలిన హెడ్‌ఫోన్స్, కాలిన యువతి మొహం
- March 15, 2017
ఓ విమానంలో హెడ్‌ఫోన్స్ పేలిపోవడంతో ఓ యువతి మొహం స్వల్పంగా కాలిపోయింది. బీజింగ్ నుంచి మెల్‌బోర్న్ వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఏదో పేలిన శబ్ధం విని సదరు యువతి ఉలిక్కి పడి లేచింది. అప్పటికే చెవికున్న హెడ్‌ఫోన్స్ నుంచి మంటలు పొగలు వ్యాపిస్తున్నాయి. మొహము, చేతులు నల్లగా కాలిపోయాయి. హెడ్‌ఫోన్స్ కాలిపోవడం గుర్తించిన యువతి.. వెంటనే వాటిని తీసి పక్కకు పడేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే మెడ మొత్తం మొహం కాలిపోయుండేదని బాధిత యువతి భయాందోళన వ్యక్తం చేసింది. కాగా, ఘటనపై వెంటనే స్పందించిన విమాన సిబ్బంది..మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. లిథియం బ్యాటరీల కారణంగా విమానంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
ఇది ఇలావుంటే విమాన సిబ్బంది మాత్రం ఆ హెడ్‌సెట్ ఏ కంపెనీకి చెందినదనే విషయాన్ని గోప్యంగా ఉంచింది. అంతేగాక, సదరు విమాన వివరాలు తెలిపేందుకు కూడా ఇష్టపడలేదు. కాగా, ఇంతకుముందు శాంసంగ్ ఫోన్లు పేలుతుండటంతో వాటిని విమానాల్లోకి తీసుకురావడాన్ని అంతర్జాతీయ ఏవియేషన అధికారులు నిషేధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







