2019లోనూ అధికారం తమదే అని కాన్ఫిడెంట్గా ఉన్న కేటీఆర్
- March 15, 2017
కేంద్ర ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం తమకు లేదని కేటీఆర్ నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. వివిధ అంశాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా కేంద్రం మిథ్య అని ఎన్టీఆర్ ఇంతకు ముందే చెప్పారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే నాయకుడు కేసీఆర్ తమకు ఉన్నారని, ఇతర పార్టీల్లో ఇంతటి సమర్ధుడైన నాయకుడు కనిపించడని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా 2019 వరకు ఉంటుందో లేదో చెప్పలేమంటూ అప్పటికి ఏమైనా జరగొచ్చంటూనే ప్రస్తుతానికి మోదీ పాలనకు ఢోకాలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గురించి మాట్లాడుతూ రాహుల్ ఎక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాశనమవుతుందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







