తొలిసారి విలన్ గా ప్రభుదేవా
- March 15, 2017
ప్రభుదేవా డ్యాన్స్ మాస్టర్ తనయుడిగా వెండి తెరపై అడుగు పెట్టినా.. తన డ్యాన్సింగ్ స్టైల్ తో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకొన్నాడు.. అంతేకాదు ప్రభుదేవా డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడుగా మల్టీ టాలెంటెడ్ పర్సన్.. చాలా సినిమాల్లో నటించిన ప్రభుదేవా తొలిసారిగా విలన్ గా వెండి తెరపై నటించడానికి రెడీ అవుతున్నాడు. ప్రభుదేవా మాజీ లవర్ నయనతార ప్రధాన పాత్రలోతమిళం లో నటించిన చిత్రం కొలైయుథిర్ కాలమ్ ని హిందీ లో రీమేక్ చేస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విషు భగ్నానీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ లండన్ లో మొదలైన ఈ సినిమాలో తమన్నా, భూమిక ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రభు దేవా ఫస్ట్ టైం విలన్ గా నటిస్తున్నారు. విలన్ గా ప్రభుదేవా ఎలా చేసారు అనేది తెలియాలంటే.. కొంత కాలం వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







