తన గురువు కోరికను తీర్చనున్న మోడీ
- March 15, 2017
భారత ప్రధాని కావాలన్న కోరిక ఎటూ నెరవేరలేదు. దేశ తొలిపౌరుడయ్యే చాన్స్ అయినా ఇచ్చి తన గురువు కోరిక నెరవేర్చడానికి మోడీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. మోదీ ఈ నెల 8న గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయన్ని సందర్శించారు. అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారి మధ్య రాష్ట్రపతి ప్రస్తావన వచ్చిందని, సోమనాథుడి సాక్షిగా ఆడ్వాణీని రాష్ట్రపతిగా చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారని సమాచారం.
ఇప్పుడు యూపీలో 325 సీట్లు గెల్చుకోవడంతో రాష్ట్రపతిగా తనకు నచ్చిన వ్యక్తినే చేసే అవకాశం మోదీకి దక్కింది.
వాస్తవానికి బీజేపీలో పలువురు నేతలు రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నారు. అయినా దీనికి తోడు 2014 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా అద్వానీ, మోదీ మధ్య తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రపతి పదవి ఇస్తామని అప్పట్లో అద్వానీకి హామీ ఇచ్చి బుజ్జగించారు. పార్లమెంటులో కేవలం రెండు స్థానాలున్న
బీజేపీని 200 స్థానాలకు పైగా తీసుకెళ్లడంలో కీలకపాత్ర వహించిన ఆడ్వాణీకి దేశ అత్యున్నతపదవి ఇచ్చి సముచితంగా గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో అగ్రనేత ఆడ్వాణీ ఈ ఏడాది జూలైలో రైజినా హిల్స్‌లోని రాష్ట్రపతి భవన్‌లోకి అడుగు పెట్టబోతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీలో తన ఎదుగుదలకు నిరంతరం సాయం చేసిన ఆడ్వాణీ పట్ల కృతజ్ఞత చూపాల్సిన సమయం వచ్చిందని మోదీ తన అనుయాయుల వద్ద చెబుతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







