సమంత రాజకీయాల్లోకి

- March 15, 2017 , by Maagulf
సమంత రాజకీయాల్లోకి

తెలంగాణ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన సినీనటి సమంత వరంగల్ జిల్లా గూండాలలో సందడి చేశారు. గుండాల గ్రామంలో పర్యటించి ఇక్కడ తయారయ్యే దోమ తెరల తయారీని పరిశీలించారు. చేనేత రంగ నిపుణులు, అక్కడి కార్మికులతో మాట్లాడారు. దోమ తెరలతోపాటు చీరలను కూడా నేస్తే ఎలాఉంటుంది? గిట్టుబాటు అవుతుందా? అనే విషయాన్ని వారితో చర్చించారు. దాదాపు గంటపాటు చేనేత కార్మికులతో గడిపిన ఆమె, తిరిగి హైదరాబాద్‌ పయనమయ్యారు.
వారంరోజుల క్రితమే సమంత మెదక్ జిల్లా దుబ్బాకలో పర్యటించి అక్కడి చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే, సమంత గుండాల పర్యటన స్థానికంగా ఆసక్తికర చర్చకు వేదికైంది. ప్రజాసేవ మీద మక్కువ చూపించే సమంత రాజకీయాల్లోకి రాబోతున్నారని వచ్చే ఎన్నికల్లో ఆమె స్టార్ క్యాంపెయినర్ అవ్వబోతున్నారని మాట్లాడుకోవడం కనిపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com