సమంత రాజకీయాల్లోకి
- March 15, 2017
తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అయిన సినీనటి సమంత వరంగల్ జిల్లా గూండాలలో సందడి చేశారు. గుండాల గ్రామంలో పర్యటించి ఇక్కడ తయారయ్యే దోమ తెరల తయారీని పరిశీలించారు. చేనేత రంగ నిపుణులు, అక్కడి కార్మికులతో మాట్లాడారు. దోమ తెరలతోపాటు చీరలను కూడా నేస్తే ఎలాఉంటుంది? గిట్టుబాటు అవుతుందా? అనే విషయాన్ని వారితో చర్చించారు. దాదాపు గంటపాటు చేనేత కార్మికులతో గడిపిన ఆమె, తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.
వారంరోజుల క్రితమే సమంత మెదక్ జిల్లా దుబ్బాకలో పర్యటించి అక్కడి చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే, సమంత గుండాల పర్యటన స్థానికంగా ఆసక్తికర చర్చకు వేదికైంది. ప్రజాసేవ మీద మక్కువ చూపించే సమంత రాజకీయాల్లోకి రాబోతున్నారని వచ్చే ఎన్నికల్లో ఆమె స్టార్ క్యాంపెయినర్ అవ్వబోతున్నారని మాట్లాడుకోవడం కనిపించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







