సెన్సార్ పూర్తి చేసుకున్నకాటమరాయుడు
- March 16, 2017
పవన్ కళ్యాణ్ న్యూఫిల్మ్ 'కాటమరాయుడు' సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి యూ సర్టిఫికెట్ ఇచ్చేశారు బోర్డు సభ్యులు. దీంతో ఈనెల 24న విడుదలకు రెడీ అయ్యింది. సినిమా మొత్తం రన్ టైమ్ 144 నిముషాలు ఉన్నట్లు టాక్. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్స్ హైలైట్‌గా చెబుతున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా బాగానే పండినట్టు యూనిట్ మాట.
నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డాలీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ముగ్గురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్ కనిపించనున్నాడు. మరోవైపు నిర్మాత, పవన్ క్లోజ్‌ఫ్రెండ్ బండ్ల గణేష్ సెన్సార్ రిపోర్ట్ చాలా గొప్పగా వచ్చిందని, బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ప్రకటించాడు. సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్‌గా ఉండటంతో మూవీపై అంచనాలు పెరిగాయి.
త్వరలో శిల్పకళా వేదికగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..







