ఫేక్ హైరింగ్ ఏజెన్సీకి గుడ్ బై చెప్పిన ఖతార్ కంపెనీ
- March 16, 2017
అక్రమంగా కొన్ని సంస్థలు ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగాల్ని మోసం చేస్తున్న వ్యవహారాలు ఎప్పటికప్పుడు వెలుగచూస్తూనే ఉన్నాయి. ఖతార్‌కి చెందిన అల్ స్రాయా గ్రూప్, ఇండియాలోని ఓ ఏజెన్సీ తప్పుడు జాబ్ ఆఫర్స్‌తో నిరుద్యోగుల్ని తప్పుదోవపట్టిస్తున్నట్లుగా గుర్తించి, దోహాలోని ఇండియన్ ఎంబసీకి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌కి చెందిన సంస్థగా దీన్ని గుర్తించారు. ఈ సంస్థకి కేవలం ఇండియాలో ఉన్న ఏజెన్సీలతో మాత్రమే డీల్ చేసేలా రిజిస్టర్ అయి ఉంది. పెద్ద మొత్తంలో నిరుద్యోగుల నుంచి డిపాజిట్లు సేకరించి, అక్రమాలకు ఆ సంస్థ పాల్పడుతున్నట్లుగా నిర్ధారించడం జరిగింది. ఉద్యోగార్థులు ఏ ఏజెన్సీని సంప్రదించాల్సి వచ్చినాసరే ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుందని అల్ సాయా గ్రూప్ ప్రతినిథులు చెప్పారు. అక్రమ ఏజన్సీల ద్వారా ఉద్యోగాలు పొంది గల్ఫ్ దేశాలకు వచ్చేవారు సమస్యలను ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







