రియాద్ నివాస పరిసరాలు నుండి అక్రమ వ్యాపారాలను తొలగించడం ప్రారంభం
- March 16, 2017
రాజధాని పొరుగు ప్రాంతంలో ఉన్న పలు అక్రమ మార్కెట్ల తొలగింపు కార్యక్రమాన్నిఅధికారులు మొదలుపెట్టారు. గత డిసెంబర్లో జారీ చేసిన ప్రభుత్వ ఆదేశం ప్రకారం నివాస ప్లాట్లుని సైతం ఈ ప్రాంతం నుంచి మార్చివేయాలని ఆదేశించారు. టైలర్స్ షాపులు మొదలు కొని దుస్తులని విక్రయించే దుకాణాలు వరకు కారు మెకానిక్స్ నుండి రిటైల్ కిరాణా దుకాణాలు వరకు చిన్న వ్యాపారాలు చేసేవారు తరలింపు కోవలో ఉన్నారు. భద్రత, ట్రాఫిక్ ప్రవాహం మరియు పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు నివాస ప్రాంతాల నుండి ఆయా దుకాణాలను వేరే చోటుకు తరలించబడతాయి. రియాద్ నగర్ అభివృద్ధి కోసం హైకమిషన్ ఆమోదించిన ప్రభుత్వ సంస్థ నిర్దేశక ఆదేశాల ప్రకారం ,ఇరుకైన ఖాళీ మరియు శిధిల భవనాలలో నివసించడానికి వీలు లేదు. ఆ క్వార్టర్లలో ఉండే వలస కార్మికులను సైతం ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారిక గణాంకాల ప్రకారం, రియాద్ లో డిసెంబర్ వరకు సుమారు 8 మిలియన్ జనాభాను కలిగి ఉంది. అయితే ఇందులో 3.4 మిలియన్ మంది విదేశీయులు ఉన్నారు.ఇది సౌదీ అరేబియా యొక్క మొత్తం జనాభాలో నాలుగింట ఇది ఒక వంతుగా పేర్కొనవచ్చు మూడు నెలల గడువు కాలం ముగిసిన తర్వాత ఇపుడు అక్రమ విభాగాలను బలాత్కారంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇందుకు విద్యుత్ శక్తీ మరియు నీటి సేవల సరఫరా నిలుపుదల చేసి వారిని ఖాళీ చేయించేందుకు అటువంటి సంస్థలు యజమానులకు తెలియపర్చినట్లు రియాద్ మున్సిపాలిటీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







