ఉగాది విడుదల కానున్న 'కారులో షికారుకెళితే'
- March 19, 2017
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 31న " కారులో షికారు కెళితే " చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు . ధీరూ మహేష్ ,సుదర్శన్ ,ప్రియాంక , ఇషికా సింగ్ , జీవా తదితరులు నటించిన హర్రర్ థ్రిల్లర్ ని శ్రీ హరిహర ఫిల్మ్స్ పతాకంపై మధు , అనీష్ , అభిరాం లు సంయుక్తంగా నిర్మించారు . రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ '' మీనాక్షి భుజంగ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుంది , పాటలు చాలా బాగా వచ్చాయి తప్పకుండా అందరినీ అలరిస్తాయని ఇక చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా మా సినిమాకు మరింత అందాన్ని ఇచ్చిందని ...... మా కారులో షికారుకెళితే తప్పకుండా యూత్ అందరినీ ఆకట్టుకుంటుందని , హర్రర్ తో పాటు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందించామని '' సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేసాడు . ఇంతకుముందు గులాబీ వంటి సామజిక ఇతివృత్తం గల చిత్రాన్ని చేసి ప్రశంసలు అందుకున్న మాదాల కోటేశ్వర్ రావు కమర్షియల్ సక్సెస్ కోసం హర్రర్ బాట పట్టాడు .
చిత్ర నిర్మాతలు మధు , అనీష్ , అభిరాం లు మాట్లాడుతూ " మిత్రుడు కోటేశ్వర్ రావు చెప్పిన కథ నచ్చడంతో కేవలం అతడి పై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం . హర్రర్ నేపథ్యంలో రూపొందిన మా కారులో షికారుకెళితే చిత్రం తప్పకుండా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని , అందుకే ఎన్ని చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ మా సినిమాని ఈనెల 31న రిలీజ్ చేస్తున్నామని అన్నారు .
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







