సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చిన బ్లాక్‌మనీ`కి
- March 20, 2017
జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్లు అందుకున్నారు మోహన్‌లాల్. ఇదే స్పీడ్‌లో అటు మలయాళంలో, ఇటు తెలుగులో వరుసగా క్రేజీ అవకాశాలు అందుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కీలకమైన రోల్స్ ప్లే చేస్తూ తన హవా చాటుతున్నారు. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు! అన్నట్టే లాల్ అటూ ఇటూ రఫ్ఫాడించేస్తున్నాడు. తాజాగా మోహన్‌లాల్ నటించిన మలయాళ సూపర్‌హిట్ `రన్ బేబి రన్` తెలుగులోకి `బ్లాక్‌మనీ`. `.. అన్నీ కొత్త నోట్లే` అన్న పేరుతో అనువాదమై రిలీజవుతోంది. నిజామ్ సమర్పణలో మాజిన్ మూవీమేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బృందం `క్లీన్ యు` సర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది.
ఈ సందర్భంగా నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ -``మోహన్‌లాల్ తెలుగులో వరుస సక్సెస్‌లతో జోరుమీదున్నారు. ఈ జోరు ఇక మీదటా కొనసాగించనున్నారు. తాజా చిత్రం మీడియా నేపథ్యంలోనిది. లాల్ ఓ టీవీచానెల్ కెమెరామేన్‌గా నటించారు. కథానాయిక అమలాపాల్ సీనియర్ ఎడిటర్ రేణుక పాత్రలో నటించారు. సంబంధ బాంధవ్యాలు, వృత్తిపరమైన సంఘర్షణ చుట్టూ కథాంశం తిరుగుతుంది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రమిది. తెలుగు వెర్షన్ అనువాదం సహా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. త్వరలోనే మంచి రిలీజ్ తేదీ చూసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నాం`` అని తెలిపారు. రతీష్ వేఘ సంగీతం, ఆర్డి రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి జోషి దర్శకత్వం వహించారు. వెన్నెలకంటి సంభాషణలు అందించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







