వ్యూహ రచన చేస్తున్న కేసీఆర్ 2019 కోసం

- March 20, 2017 , by Maagulf
వ్యూహ రచన చేస్తున్న కేసీఆర్ 2019 కోసం

 అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు కావొస్తుండడంతో ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కీలక మార్పులు జరగొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.  బడ్జెట్ సమావేశాలు ముగిశాక కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.  పని చేయని నేతలను పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక డబుల్ బెడ్రూమ్ స్కీమ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.  ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఈ నెలాఖరు నాటికి రెండున్నర లక్షలకి పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి కావలసి ఉంది. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్ ఈ ఏడాది చివరి నాటికి రెండు లక్షల ఇళ్ళు నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.  అదే సమయంలో రెండున్నరేళ్ళ పాలనపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకోవాలని అనుకుంటున్న కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com