బెల్లం'కొండ' తో కీర్తి సురేష్

- March 20, 2017 , by Maagulf
బెల్లం'కొండ' తో  కీర్తి సురేష్

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో వున్న యంగ్ హీరోయిన్లలో కీర్తి సురేష్ కి రోజురోజుకీ క్రేజ్ పెరుగుతోంది. తెలుగుతో పాటూ తమిళ్ లో కూడా టాప్ హీరోయిన్ పొజిషన్ కోసం కీర్తి లైన్ లో వుంది. టాలీవుడ్.. కోలీవుడ్ రెండు చోట్లా బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తోంది. తెలుగులో ఇప్పటివరకూ కీర్తి చేసినవి రెండు సినిమాలు సక్సెస్ కావడం ..అలాగే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో ఆఫర్ రావడంతో కీర్తి రెమ్యునరేషన్ కోటి క్రాస్ చేసేసిందనే టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ అయితే కీర్తికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ మూవీ కోసం కీర్తి సురేష్ హీరోయిన్ గా తీసుకోవాలని కోటీ ఎనబై లక్షల రెమ్యునరేషన్ ఆఫర్ చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఇంతకుముందు బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ మూవీ అల్లుడు శీను కోసం సమంతకి కూడా భారీ రెమ్యునరేషన్ ఇచ్చి హీరోయిన్ గా తీసుకున్నారు. మరి ఇప్పుడు బెల్లంకొండ ఆఫర్ కి కీర్తి ఎస్ అంటుందా లేదా అనేది చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com