గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో రాహుల్ గాంధీ
- March 21, 2017
AICC ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కబోతున్నారు. సరికొత్త వరల్డ్ రికార్డు స్థాపించబోతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షాక్‌లో ఉన్న రాహుల్ గిన్నిస్ రికార్డు చేయమేంటని డౌట్ వస్తోందా. ఈ వరుస ఓటమిలే ఆయనను రికార్డు పుస్తకంలోకి ఎక్కించబోతున్నాయి. కాకపోతే.. ఆయన తరఫున ఈ రికార్డు కోసం మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అప్లై చేశాడు. రాహుల్‌ను వరల్డ్ రికార్డ్ హోల్డర్‌గా నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
రాహుల్ గాంధీ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ మఠాషే అంటాయి ప్రత్యర్థి పార్టీలు. అభ్యర్థుల ఓటమి ఖాయం అంటాయి. ఇప్పుడు రాహుల్ దెబ్బతో ఓడిపోయిన వారందరి లెక్కా తీశాడు ఎంపీకి చెందిన విశాల్ దివాన్. రాహుల్ గాంధీ మొత్తం 27 ఎన్నికల్లో ఓటమి పాలైనట్లు లిస్ట్ రెడీ చేశాడు. దీన్ని ఆయన ఘనతగా భావించి.. గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించాలని వారికి ఒక లెటర్ రాశాడు. అందరికంటే ఎక్కువ ఎన్నికలు ఓడిన వ్యక్తిగా రాహుల్ రికార్డును గుర్తించాలని విశాల్ కోరుతున్నాడు. 2012 నుంచి 2017 వరకూ రాహుల్ ఎక్కడెక్కడ, ఎవరెవరికి ప్రచారానికి వెళ్లాడో ఆ రికార్డులన్నీ సేకరించాడు విశాల్. లెటర్ తోపాటూ వీటన్నింటినీ జోడించాడు. గిన్నిస్ వారికి లెటర్ రాయడమే కాదు.. ఈ రికార్డు కోసం ఎన్ రోల్ మెంట్ ఫీజ్ కూడా తనే కట్టాడు. ఇతడి లెటర్ ను వెంటనే యాక్సెప్ట్ చేసిన గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధులు.. అప్లికేషన్ అప్రూవ్ అయ్యిందా లేదా ఇంకా సమాచారం అందలేదు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







