ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన
- March 21, 2017
తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జోరుగా ఊపందుకున్న తరుణంలో అటు ఆస్ట్రేలియాలో కూడా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల నాయకత్వంలో ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
సాయిరాం ఉప్పు ,విక్రమ్ కటికనేని , రవి సాయల , శ్రీకాంత్ రెడ్డిల అద్వర్యంలో మెల్బోర్న్ , సిడ్నీ , కాన్బెర్రా , బ్రిస్బేన్, అడిలైడ్ ల లోనగరంలో నిర్వహించిన ' టీఆర్ఎస్ ఆస్ట్రేలియా మెంబర్షిప్ డ్రైవ్'(సభ్యత్వ నమోదు) కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది, పెద్ద ఎత్తున ప్రవాస భారతీయలైన తెలంగాణ బిడ్డలు పాల్గొని, సభ్యత్వాన్ని స్వీకరించి, తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.
ఈ సందర్బంగా అధ్యక్షుడునాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ మునుపెన్నడెరుగని విధంగా ఏ ప్రవాస భారతీయ పార్టీ శాఖకు రాని విధంగా తమ టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖకు అనూహ్య స్పందన లభిస్తుందనీ,దినదినాభివృద్ధి చెందుతూ ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో తమ శాఖలు ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో సభ్యులను కూడగట్టుకొని అనే కార్యక్రమాలను చేయడం జరిగిందన్నారు.
కొత్తగా చేరిన సభ్యులను పార్టీ కండువాలు కప్పి అభినందించి, క్రమశిక్షణ గలిగిన సభ్యులుగా మెలగాలనీ,తెలంగాణలోని తమ నాయకుల సూచనలు శిరసావహిస్తూ, ప్రతి ప్రతిష్టకు ఊతమిస్తూ ముందుకు సాగాలనిపిలుపునిచ్చారు. తమకీ సాదావకాశాన్ని కల్పించిన గౌరవ ఎం పి శ్రీమతి కవిత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, వారునిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు మద్దతునిస్తూ, తమను ప్రోత్సహిస్తున్న అన్ని ప్రవాస తెలంగాణ సంఘాలకుధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు డా అనిల్ రావు , రాజేష్ రాపోలు , మాధవ్కటికనేని, సత్యం రావు, డా అర్జున్ ,అమర్ రావు,ప్రకాష్ సూరపనేని,అభినయ్ కనపర్తి, సనిల్ రెడ్డి, వరుణ్నల్లెల్ల,వెంకట్ చెరుకూరి, ఉదయ్ కల్వకుంట్ల , అమర్ రావు చీటీ, ప్రవీణ్ లేడల్లా, కళ్యాణ్ ఐరెడ్డి, శ్రీకాంత్, రాకేష్ లక్కరసు, సాగర్ రెడ్డి, చంద్ర మోరంపూడి, విన్నీ తూముకుంట, పరశురామ్, సంగీత దూపాటి, దినేష్ రెడ్డి,క్రాంతి రెడ్డి, హేమంత్, రవిశంకర్ రెడ్డి, సాయి యాదవ్, రాకేష్ గుప్త, వేణునాథ్, కిరణ్ పాల్వాయి, శ్రీనివాస్ కర్ర, ప్రవీణ్ దేశం, సతీష్ పాటి, పుల్ల రెడ్డి బద్దం, ఈశ్వర్, తెలంగాణ మధు, వివిధ తెలంగాణ సంఘ నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







