హాస్పిటల్ బెడ్‌పైనే కొత్త సినిమా కథను విన్న దాసరి
- March 21, 2017
దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనను త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారని ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి తెలిపారు. అనారోగ్యంతో కిమ్స్ హాస్పిటల్ చేరి చికిత్స పొందుతున్న దాసరిని మంగళవారం అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణారెడ్డి పరామర్శించారు. దాసరి ఆరోగ్య పరిస్థితిని అచ్చిరెడ్డి ఫేస్బుక్లో వెల్లడించారు. దాసరి నారాయణ దాదాపు పూర్తిగా కోలుకొంటున్నారు. కృష్ణారెడ్డి రూపొందించబోయే కొత్త సినిమా కథ గురించి స్వయంగా గుర్తు చేసి తెలుసుకొన్నారు. భారీ విజయం సాధించాలని మమ్మల్ని ఆశీర్వదించారు. అదీ ఆయన గొప్పదనం. అందుకే తెలుగు సినిమా పరిశ్రమ దాసరి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నారని అచ్చిరెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







