గన్నవరంలో ల్యాండ్ అయ్యిన ఎయిర్‌బస్‌-320

- March 22, 2017 , by Maagulf
గన్నవరంలో ల్యాండ్ అయ్యిన ఎయిర్‌బస్‌-320

గన్నవరం విమానాశ్రయానికి సేవలందించేందుకు నూతన ఎయిర్‌బస్‌ బుధవారం సాయంత్రం 4.45 నిమిషాలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎయిర్‌ ఇండియా లీజుకు తీసుకున్న 14 విమానాల్లో ఒకదాన్ని ఈ విమానాశ్రయానికి కేటాయించటం విశేషం. ఇక్కడి నుంచి హైదరబాద్‌ మీదుగా దిల్లీకి ఈ విమానం సర్వీసులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. కొత్త ఎయిర్‌ బస్‌-320ని డైరెక్టర్‌ మధుసూధనరావు, స్టేషన్‌ మేనేజర్‌ రాజశేఖర్‌లు వైమానికశాఖ ఆనవాయితీ ప్రకారం వాటర్‌ కేనల్‌ సెల్యూట్‌తో స్వాగతించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com