డిజిపికి కెటిఆర్ ట్వీట్ ...చిరు వ్యాపారిపై పోలీస్ జులుం

- March 22, 2017 , by Maagulf
డిజిపికి కెటిఆర్ ట్వీట్ ...చిరు వ్యాపారిపై పోలీస్ జులుం

రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుని బ్రతుకు సాగించే చిరు వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసుల జులం తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఇలా మండే ఎండలో రోడ్డుపక్కన పుచ్చకాయలు అమ్ముకుంటున్న వ్యక్తిపై ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ జంగయ్య ఓవరేక్షన్ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందంటూ బండిమీదున్న పుచ్చకాయల్ని రోడ్డుకేసి కొట్టి బండి తీస్తావా లేదా అంటూ బెదిరించాడు. వారం రోజుల క్రితం ఉప్పల్‌లోని నల్ల చెరువు ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాల్ని రోడ్డుపై అటుగా వెళ్తోన్న వ్యక్తి షూట్ చేసి 'తెలంగాణలో ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్‌' అని మంత్రి కెటిఆర్‌ ట్విట్టర్‌ ఖాతాకు ట్వీట్‌ చేశాడు.
దీనిపై కెటిఆర్ స్పందించారు.
'దీనిపై చర్య తీసుకోవాలని, ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే కిందిస్థాయి అధికారులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలంటూ తెలంగాణ డిజిపి ఖాతాకు కెటిఆర్ రీట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై తెలంగాణ డిజిపి స్పందించనప్పటికీ, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ స్పందించి విచారణకు ఆదేశించారు. సంఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌ రావును ఆదేశించారు. కెటిఆర్ స్పందనపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కెటిఆర్ ని కీర్తిస్తూ అభినందనలు చెబుతున్నారు. ఇంతకుముందుకూడా కెటిఆర్ ఇలాంటి ఘటనల్ని ఉన్నతాధికారుల దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com