సౌదీ నుండి నిజామాబాద్ కు చేరిన వలసజీవి శవపేటిక
- March 22, 2017
నిజామాబాద్ జిల్లా డిచుపల్లి మండలం రాంపూర్ కు చెందిన కాశోల్ల దేవేందర్ (26) తేది: 09.03.2017 న సౌదీ అరేబియాలోని దమ్మామ్ లో గుండెపోటుతో మరణించారు. ఇతని మృతదేహం కలిగిన శవపేటిక తేది: 23.03.2017 న ఉదయం దమ్మామ్ (సౌదీ) నుండి హైదరాబాద్ కు చేరనున్నది. శవపేటికతో పాటు సౌదీ నుండి అదే గ్రామానికి చెందిన కలిగోట్ ప్రదీప్ వస్తున్నారు. కాశోల్ల దేవేందర్ తండ్రి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేయడానికి తమిళనాడు నుండి 50 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
తెలంగాణ ఎమిగ్రంట్స్ లేబర్ యూనియన్ (తెలంగాణ ప్రవాసి కార్మిక సంఘం) రాష్ట్ర ఉపాధ్యక్షులు బొండల గంగా ప్రసాద్ (మోర్తాడ్ +91 88976 15160) గారి సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి రాంపూర్ వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
ఎం. భీమ్ రెడ్డి
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







