తన విన్యాసాలను చూస్తున్న వ్యక్తినే ' ఢీ ' కొట్టిన స్టంట్ డ్రైవర్ అబుదాబిలో అరెస్టు
- March 22, 2017
నిర్లక్ష్యంగా వాహనాన్ని డ్రైవింగ్ చేయడమే కాక తన విన్యాసాలను చూస్తున్న ఒక వ్యక్తిని వాహనంతో ' ఢీ ' కొట్టి గాయాల పాల్జేసిన ఓ19 ఏళ్ల యువకుడిని అబూధాబీ పోలీసులు అరెస్ట్ చేశారు.తాను నడుపుతున్న వాహనంకు ఎటువంటి నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడని మరో ఆరోపణ సైతం ఆ వ్యక్తిపై పోలీసులు నమోదు చేశారు. స్థానిక అరబిక్ దినపత్రిక ఎమరాత్ అల్ యుం తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువకుడు అల్ షామిఖ ప్రాంతంలో పాఠశాల సమీపంలో చూపరుల సమూహం ఎదుట అపాయకరమైన సాహసకృత్యాలను చేయటానికి ఒక కారుని ఉపయోగించుకొన్నట్లు పేర్కొంది. తడి వాతావరణం కారణంగా,ఆ యువకుడు తన వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఈ సమయంలో ఈ విన్యాసాలను చూస్తున్న ఓ ప్రేక్షకుడిని కారు ఢీ కొట్టింది. ఆ యువకుని కారు సాహసాల సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యబడ్డాయి అటువంటి ప్రమాదకరమైన సాహసకృత్యాలను వాహనంతో చేయకూడదని పోలీసులు ఈ సందర్భంగా యువతకి సూచించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







