థియేటర్ల ఆశలు అన్ని కాటమరాయుడిపైనే

- March 22, 2017 , by Maagulf
థియేటర్ల ఆశలు అన్ని కాటమరాయుడిపైనే

కాటమరాయుడుపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు తెలుగు రాష్ర్టాల్లో థియేటర్ల ఓనర్స్. ఎందుకంటే గడిచిన మూడువారాలుగా 16 చిన్న సినిమాలు రిలీజైనా ఒకటి లేదా రెండు తప్పితే మిగతావన్నీ బాక్సాఫీసు వద్ద హిట్ బొల్తాపడ్డాయి. దీంతో తెలుగు రాష్ర్టాల్లో థియేటర్స్ వెలవెలబోతున్నాయి. దీనికితోడు పిల్లలకు పరీక్షలు రావడం కూడా దీనికి కారణమైంది. ఈనెల 24న తెలుగు రాష్ర్టాలతోపాటు మిగతా రాష్ర్టాలు, విదేశాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది కాటమరాయుడు సినిమా.
దీంతో ఈ ఫిల్మ్ ఓపెనింగ్స్ ఎలా వుంటాయి? భారీగా వుండబోతుందా? ఇప్పటికైతే 80శాతం అడ్వాన్స్ బుకింగ్ అయినట్టు చెబుతున్నారు థియేటర్ల ఓనర్స్. ఓపెనింగ్స్ ఎలా వుంటాయన్నది చెప్పలేమని అంటున్నారు.
బయ్యర్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు.. చాలా ఏరియాల్లో సర్దార్ గబ్బర్‌సింగ్‌ హక్కుల్ని కొనుగోలు చేసినవాళ్లకే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి హిట్ 
కాకపోతే తమకు మరిన్ని కష్టాలు తప్పవని అంటున్నారు. ఇప్పటివరకు పవన్ సినిమాలు 100 కోట్ల మార్క్‌ని 
తాకడంలేదని, ఈసారి అందుకోవడం ఖాయమని చెబుతున్నారు అభిమానులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com