కాకినాడ
- April 21, 2015
"కాకినాడ" కడలి అంచునవాడ
'ఓడ'రేవున్న ఊరు మా వాడ!
ఊరికే గాలేస్తుంది, ఉండుండి ఉక్కపోస్తుంది,
వానొస్తుంది గాని వరద రాదు!
ఉల్లాసంగా ఊరంతా ఊరేగే పూజలు
ఉప్పుటేరు మీద గాలి, ఊరేగాలి!
సాంప్రదాయానికి, సహృదయానికి సంకేతం
సంస్కారహీనమే అనారోగ్య కారణం!
శుక్రవారం సంత రోజు,
కొంత లో కొంత ఆదివారం శలవరోజు!
ఊరి మధ్యలో చెరువులున్నా,
ఊరి చుట్టూ ఉప్పుటేరున్నా
కుళాయి గొట్టాల్లో నీరు సున్నా!
కార్పొరేషన్ ఖజానా నిండుగా ఉన్నా,
కొల్లగొట్టే బడాబాబులు మెండుగా ఉన్న ఊరు!
రాజులున్న చోటు రామారావు పేట
రాచనిమ్మ తోట గాంధీ నగరం!
కళాశాలలకు కొదువ కాదు,
కళాకారులకు కొలువు లేదు!
అన్నదాన సమాజం
నిత్యాన్న దానానికి నీరాజనం!
మధ్యాహ్న భోజనానికి,
సుబ్బయ్య గారి హోటల్లో ఊరి జనం!
ఒక్కవీధి లోనే సినిమా సాగరం,
ప్రక్కవీధి లోనే మన 'సారా' సంగమం!
విపణి వీధిలో ధరల కాల్పులు,
దేవళం వీధిలో కొలువు తీరిన వేల్పులు!
రంభలున్న పేట బుడం పేట,
ఎడంగా ఉండకపోతే 'ఎయిడ్స్' బాట!
తాగుబోతులకేమి తక్కువ లేదు,
తిరుగుబోతులేమి ఎక్కువ కాదు!
వీధులన్నీ విశాలంగా ఉన్నా
ట్రాఫిక్‌కు రూల్సు మనకెందుకు అన్నా!
ఊరి బాబుగారి రోడ్డు మీద
ఊసులాడుకుంటారు ఊరి జనం,
తప్పుకోమంటే కస్సుమంటారు జాగ్రత్త!
పశువులన్నీ పడుకునే పర్ణశాలలే
పాదయాత్రకు పనికి రాని రోడ్లు
పదిమందికి పనికొచ్చే పాకి దొడ్లు
నాకెందుకనుకునే నగర పాలకుల కునికిపాట్లు!
దోచుకునే గజ దొంగలున్నారు
దొడ్డ మనసున్న బిజీ దొరలున్నారు!
దోబూచులాడే దౌర్జన్యపు దోమలున్నాయి
'దోసెల'మీద దుర్గంధపు ఈగలున్నాయి!
"కాకినాడ" కడలి అంచున వాడ,
ఓడ రేవున్న ఊరు మా వాడ!
--- డా|| కోడి రామ, అలైన్, యు ఏ యి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







