కొన్ని బ్యూటీ టిప్స్!!
- April 21, 2015
, by Maagulf
- కంటి మేకప్ తుడుచుకోటానికి రోజ్ వాటర్ లో ముంచిన నూలుబట్ట ఉపయోగించాలి. నెమ్మదిగా వత్తుతూ తుడవాలి. కనురెప్పల చివర్లజాగ్రత్తగా తుడవాలి.
- కొవ్వొత్తి వెలుతురులో ప్రతిరోజూ మెడిటేషన్ చేసుకుంటే మనసుకే కాకుండా కంటికి కూడా ప్రశాంతత చేకూరుతుంది
- పొగ త్రాగటం వలన విటమిన్ "సి" లోపించి కళ్ళ చుట్టూ నల్లని చారలు ఏర్పడగలవు.
- పెంపుడు జంతువుల చేష్టలను ఆలోచిస్తూ నిద్రపోతే మంచి నిద్రపడుతుంది.
- నిద్రకు ముందు గ్లాసు గోరువెచ్చని పాలు త్రాగిన మంచి నిద్ర పడుతుంది.
- దోసకాయ ముక్కలు మూసిన కనులపై వుంచుకొని కనులకి కాంతిని ఇవ్వగలవు.
- వేడినీటిలో ఒక చెంచా సాల్ట్ కలిపి నూలు గుడ్డ ముంచి పిండి కనురెప్పలపై వుంచిన కళ్ళవాపు తగ్గగలదు.
- సిట్రస్ జాతి ఫలాలు అంటే నిమ్మ లాంటివి డైరెక్ట్ గా ముఖం పై రాయకూడదు.పాలల్లో కలిపి రాసుకోవాలి.
- చలికాలం లో అంతగా దాహం వేయదు అలా అని శరీరానికి నీళ్ళ అవసరం లేదనుకుంటే పొరపాటు. ఈ కాలం లో కూడా రోజుకి కనీసం 7-8 గ్లాసుల నీరు తాగాలి. చర్మానికి మంచి నిగారింపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం పై కూడా ఆధారపడి ఉంటుంది.
- చర్మాన్ని తెల్లగా, మెత్తగా తయారు కావాలంటే ఓట్ మీల్ పిండి పెరుగు కలిపి ముఖం పై ప్యాక్ లా వేసుకుని 20 నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ముఖాన్ని కడుక్కోవాలి.