మళ్లీ ఒక్కటి కాబోతున్న సంగీత దిగ్గజాలు బాలు ఇళయరాజా

- March 22, 2017 , by Maagulf
మళ్లీ ఒక్కటి కాబోతున్న సంగీత దిగ్గజాలు బాలు ఇళయరాజా

తమిళ సినీరంగం తరఫున ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానసభను నిర్వహించేందుకు సన్నాహాలు చేపడుతున్నట్టు నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్‌ తెలిపారు. సన్మానసభ సందర్భంగా ఇళయరాజా నిర్వహించే సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొంటారని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని పలు నగరాల్లో ఎస్పీబీ సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఆసందర్భంగా తన ముందస్తు అనుమతి లేకుండా సంగీత కచేరీలలో తన సంగీత దర్శకత్వంలో రూపొందిన సినిమా పాటలను పాడరాదని ఎస్పీబీకి ఇళయరాజా లాయర్‌ నోటీసు పంపారు. ఆ నోటీసుపై స్పందించిన ఎస్పీబీ ఇకపై తన సంగీత కచేరీలలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన పాటలను పాడనని ప్రకటించారు.
ఇలా ఇరువురి మధ్య మనస్పర్థలు తీవ్రమైన తరుణంలో విశాల్‌ ఆ ఇరువురు ఒకేవేదికపై సంగీత విభావరిలో పాల్గొంటారని ప్రకటించి సంచలనం కలిగించారు. ఈ విషయంపై ఇప్పటికే ఇద్దరితో మాట్లాడినట్లు విశాల్ తెలిపారు. ఎదేమైనా సంగీత దిగ్గజాలను మళ్లీ ఒక్కటి చేస్తున్నందకు విశాల్‌ను అభినందించాల్సిందే నిర్మాతల సంఘం ఎన్నికలు ముగిసిన తర్వాత ఇళయరాజాకు సన్మానసభ జరుపుతామని విశాల్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com