రైతులకు అండగా నిరసనలో పాల్గొన్న విశాల్ మరియు ప్రకాష్ రాజ్
- March 24, 2017
హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. మేకప్, షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి తమిళనాడు రైతులకు అండగా ఢిల్లీ నడివీధుల్లో గళమెత్తారు. విపరీతమైన కరువుతో తల్లడిల్లుతున్న తమిళనాడు రైతులకు న్యాయంచేయాలంటూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిర్వహిస్తోన్న ధర్నాలో ప్రకాష్ రాజ్, విశాల్ పాల్గొన్నారు.
నల్లటి దుస్తులు వేసుకున్న విశాల్, ప్రకాష్ రాజ్ రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. గత వారంరోజులుగా తమిళనాడు రైతుల ఢిల్లీలో తమ రోదనలను వినిపిస్తున్నా ఎవరూ వినిపించుకోవడం లేదని, అందుకే ఇక్కడకు రావాల్సివచ్చిందని ప్రకాష్ రాజ్, విశాల్ అన్నారు.
తమ నిరసనలతోనైనా సంబంధిత మంత్రులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, కరువుతో అల్లాడుతున్న తమిళనాడును ఆదుకోవాలని.. కరువు సహాయకచర్యలు చేపట్టాలని.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ తమిళనాడు రైతులు మెడలో కపాలాలు ధరించి కరువు తీవ్రతను ప్రతిబింబించేలా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







